Saturday, 21 January 2017

SS Rajmouli Special interview with Krish

SS Rajmouli Special interview with Krish about Gautami Putra Satakarni || Balakrishna, Shriya 





Friday, 16 December 2016

Balakrishna Powerful Speech |

Balakrishna Powerful Speech | Gautamiputra Satakarni Movie Trailer Launch 





Sunday, 4 December 2016

గౌతమీపుత్రుడి సమరనాదం

బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకుడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, జె.సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ మొరాకోలో ఇటీవలే పూర్తయింది. 

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకున్న మొరాకోలోని అట్లాస్ స్టూడియో, వరు జార్జియస్‌లో చిత్రీకరణ జరిపాం. ఒకటవ శతాబ్దం నాటి కాలమాన పరిస్థితుల్ని మన కళ్లముందుంచే లొకేషన్లలో ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో భారీ పోరాట ఘట్టాల్ని తెరకెక్కించాం. బాలకృష్ణ, ప్రతినాయకుడు కబీర్‌బేడికి మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాల్ని చిత్రీకరించాం. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రెండు వందల గుర్రాల్ని, ఒంటెలను ఉపయోగించాం. ఈ యుద్ధ ఘట్టాల్లో దాదాపు 1000మంది పాల్గొన్నారు. మొరాకోలో తొలిసారి చిత్రీకరణ జరుపుకున్న భారతీయ చిత్రంగా గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర సృష్టించింది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం క్రింద పరిపాలించిన మహా చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. తెలుగువారందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది.

భారతదేశంలోనే మహాయోధుడైనటువంటి గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్రను వెండితెర దృశ్యమానం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాము. దర్శకుడు క్రిష్ జనరంజకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్,ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: దేవీశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, దర్శకత్వం: క్రిష్.

దొరికాడోచ్

గౌతమీ పుత్రకు మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడోచ్




నందమూరి నటసింహం బాలయ్య వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నేపథ్యంలో, పని ఒత్తిడి కారణంగా ఈ మూవీ నుంచి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తప్పుకున్నాడు . దీంతో సంగీత దర్శకుడిని వెతికే పనిలో పడిన హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ కల్సి మొత్తానికి ఓ మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టేసారు.

వాస్తవానికి ఇలాంటి చారిత్రక నేపథ్యమున్న సినిమాలకు సంగీతాన్నందించడంలో సిద్ధహస్తులయిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాను గానీ, ఎమ్ ఎమ్ కీరవాణిని గానీ తీసుకోవాలని చిత్ర దర్శకుడు క్రిష్ , హీరో బాలకృష్ణ భావించారు. దేవీ స్థానంలో వీరిద్ద రిలో ఒకరిని తీసుకోవాలని భావించినా, చివరకు విరమించుకున్నారు. ఎందుకంటే, వారితో కూడా ఇలాంటి ఒత్తిడి సమస్యే వచ్చే అవకాశ ముందున్న ఉద్దేశ్యంతో రిస్క్ తీసుకోకుండా, ‘కంచె’ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన చిరంతన్ భట్ నే క్రిష్ ఎప్రోచ్ అయ్యాడట. ఇక మరోమాట మాట్లాడకుండా, భట్ హ్యాపీగా అంగీకరించాడు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు కొత్త సంగీత దర్శకుడు దొరికేసాడు. ఇక ఈమూవీలో బాలయ్య తల్లిగా హేమమాలిని, భార్యగా శ్రియ నటిస్తున్నారు.

Saturday, 22 October 2016